క్వారంటైన్ కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతి
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రా, తెలంగాణ బార్డర్ లో చిక్కుకుపోయిన విద్యార్థులు, ఇతర ప్రయాణికుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. కొంతమంది క్వారంటైన్లకు వెళ్లిపోగా మరికొంతమంది హైదరాబాద్ కు తరిగివస్తున్నారు. దీంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన హైడ్రామాకు ఎండ్ కార్డు పడినట్లైంది. 7 గంటలకు పైగా గరికిపాడు వద్ద విద్యార్థులు పడిగాపులు కాశారు. క్వారంటైన్ కు అంగీకరించిన వారికి మాత్రమే ఏపీలోకి అనుమతించారు.
ఎంట్రీ హైదరాబాద్ లో హాస్టల్స్, మెస్సులు మూసివేయడంతో సమస్య మొదలైంది. అప్పటివరకు హాస్టల్స్ ఉన్న వేలాది మంది విద్యార్థులు ఏపీకి పయనమయ్యారు. బయట ప్రయాణించకుండా నిషేధించడంతో వేలాది మంది పోలీసులను ఆశ్రయించారు. చెక్ పోస్టులు, టోల్ గేట్లలో ఆపకుండా వారికి నిరభ్యంతర పత్రాలను జారీ చేశారు. వాటిని పట్టుకొని వెళ్లిన విద్యార్థులను ఏపీ బార్డర్ జగ్గయ్యపేట సమీపంలోని గిరికపాడు చెక్ పోస్టు వద్ద అందరినీ ఆపేశారు. రాత్రి వరకు వారిని ఏపీలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులంతా పడిగాపులు గాశారు.
ఉదయం నుంచి తమ సమస్యపై స్పందించకపోవడంతో విద్యార్థులు..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమస్య ఏపీ మంత్రి బొత్స సత్యానారయణ దృష్టికి వెళ్లింది. వెంటనే బొత్స..తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. కరోనా ముప్పు తీవ్రంగా ఉన్న సమయంలో విద్యార్థులు, యువత ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరం కాదని బొత్స..కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ చర్చించిన విషయాలను బొత్స…జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ సీఎస్ కూడా ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ తో చర్చించారు.
విద్యార్థులను ఏపీకి అనుమతిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు సీఎంలు చర్చించుకోవడంతో సమస్య సమిసిపోయింది. కొత్తగా ఎవరినీ అనుమతించబోమని ఏపీ సర్కార్ తెలిపింది. హాస్టల్స్, మెస్ లు మూసేయవద్దని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. పోలీసులిచ్చిన ఎన్ వోసీ పత్రాలు చెల్లవని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగనివ్వబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. అవసరమైతే ఆహారాన్ని సరఫరా చేస్తామని జీహెచ్ ఎంసీ మేయర్ అన్నారు.
ఏపీ సీఎం జగన్ దృష్టికి సమస్య రావడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. అనంతరం జగ్గయ్యపేట చేరుకున్న ఏపీ వారికి హెల్త్ ప్రోలో కాల్ పాటించి ఏపీలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఈమేరకు జగన్ పోలీసులు, అధికారులకు స్పష్టమైన అదేశాలు ఇచ్చారు. వచ్చిన వారి హెల్త్ ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాతే స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇలాగే వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తే వారికే కాక వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా రిస్క్ లో పెట్టినట్లు అవుతుందన్నారు. అందుకే హెల్త్ ప్రోటో కాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశించారు.
ప్రత్యేక బస్సుల ద్వారా హెల్త్‌ప్రోటో కాల్ కోసం అధికారులు వారిని తరలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని క్వారంటైన్ చేస్తున్నారు. పగడ్బందీగా హెల్త్ ప్రోటోకాల్‌ను అధికారులు పాటిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్ ఐటీకి తరలిస్తున్నారు. ఈస్ట్ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వెస్ట్‌గోదావరి తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు.
అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు. తాము క్వారంటైన్లకు వెళ్లబోమని హైదరాబాద్ కు తిరిగి వెళ్తామని చెబుతున్నారు. వెంటనే కొంతమంది విద్యార్థులు తిరుగుప్రయాణం అయ్యారు. క్వారంటైన్ కు అంగీకరించిన వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. క్వారంటైన్ కు తరలించడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వంతూళ్లకు వెళ్లాలనుకున్న వారికి నిరాశ ఎదురైంది. దీంతో క్వారంటైన్ వెళ్లేదానికి కంటే హైదరాబాద్ కు తిరిగి వెళ్లడం మంచిదని భావిస్తున్నారు. ఆ మేరకు హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. మొత్తం మూడు వేలకు పైగా వెళ్లగా ఇందులో సగం మంది క్వారంటైన్లకు వెళ్లారు. మిగిలిన వారు హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. తమ తమ వాహనాల్లో తిరిగి వస్తున్నారు.
అంతకముందు తెలంగాణ ప్రభుత్వం ఎన్ వోసీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం అనుమతించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణకు తిరిగి వెళ్లాలో..ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతిస్తారో తెలియక అయోమయానికి గురయ్యారు. మరోవైపు విద్యార్థుల సమస్యలపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స, తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. ఈ సమయంలో హాస్టళ్లు ఖాళీ చేయిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు.
దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. హాస్టళ్లు, మెస్సులు మూసివేయకుండా చూడాలని జీహెచ్ ఎంసీ మేయర్ ను ఆదేశించారు. మరోవైపు హాస్టళ్లు,మెస్సులు మూసివేయొద్దని యాజమాన్యాలకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి చర్యలు వచ్చే వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు.
See Also | క్వారంటైన్లకు వెళ్లేందుకు విద్యార్థుల నిరాకరణ…హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం