హిందూపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వామీ

త్వరలో జరగనున్న లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు.

హిందూపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వామీ

Paripoornananda Swami announces to contest from hindupur as bjp candidate

Swami Paripoornananda : హిందూపురం లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాను ఖరారు అయినట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు.

దక్షిణాదిలో హిందూపురం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూపురం అంటే.. హిందూ అని పేరులోనే ఉన్నదని, అందుకే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. అందుకే ఆ పార్టీ తరపున బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు.

Also Read: మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను, నన్ను ఆశీర్వదించండి- నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్