TDP Showcause notices : గాజువాక టీడీపీ కార్పొరేటర్లపై అధిష్టానం సీరియస్ : ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు

వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు.

TDP Showcause notices : గాజువాక టీడీపీ కార్పొరేటర్లపై అధిష్టానం సీరియస్ : ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు

Tdp Corporators

Updated On : March 20, 2021 / 1:12 PM IST

Showcause notices to seven TDP corporators : వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీ గ్రేటర్ విశాఖలో కొత్త చర్చకు దారి తీసింది. తమ పార్టీ కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ అవ్వటంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్యే నాగిరెడ్డితో భేటీ అయిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ఇటీవల విశాఖ వైసీపీ నేతలు ప్రకటించారో లేదో .. టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే నాగిరెడ్డితో భేటీ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. నేరుగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నివాసానికి వెళ్లి .. టీడీపీ నేతలు బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ డివిజన్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి సహకరించాలని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డిని కోరారు.

ఎమ్మెల్యేని కలిసిన వారిలో పల్లా శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ల కోటేశ్వరరావు, బోండా జగన్నాథం, ముత్యాలు ఉన్నారు. అయితే తమ పార్టీ కార్పొరేటర్లు స్వయంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి చర్చలు జరపడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని నోటీసుల్లో తెలిపారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు.

మరోవైపు భేటీ వెనుక వేరే ఉద్దేశం లేదని అంటున్నారు.. ఎమ్మెల్యే నాగిరెడ్డిని కలిసిన టీడీపీ కార్పొరేటర్లు. కార్పొరేటర్‌లుగా తాము ఎన్నికవడంతో .. స్థానిక ఎమ్మెల్యేని కలిసి అభివృద్ధికి సహకరించాలని మాత్రమే కోరామని చెబుతున్నారు. తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని, తామంతా టీడీపీలోనే కొనసాగుతామని అంటున్నారు.