Pawan Kalyan : జనసేన పోటీచేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కల్యాణ్.. టీడీపీ పొత్తుధర్మం తప్పిందంటూ వ్యాఖ్య

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీచేయబోయే స్థానాల్లో తొలుత రెండు స్థానాలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో రేసులో ఉన్న జనసేన అభ్యర్థుల పేర్లను పవన్ వెల్లడించారు.

Pawan Kalyan : జనసేన పోటీచేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కల్యాణ్.. టీడీపీ పొత్తుధర్మం తప్పిందంటూ వ్యాఖ్య

Pawan Kalyan

Janasena MLA Candidates :  గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన పొత్తు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ స్పందించారు. పొత్తు ధర్మ ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు.. చేశారు.. అందుకు జనసేన నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే నాకూ ఒత్తిడి ఉంది. టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి.. ప్రత్యేక పరిస్థితుల్లోనే నేనూ జనసేన పోటీచేయబోయే రెండు నియోజకవర్గాలను అనౌన్స్ చేస్తున్నానని పవన్ అన్నారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని, రాజానగరం రేసులో బత్తుల బలరామకృష్ణ, రాజోలు రేసులో బొంతు రాజేశ్వరరావు, వరప్రసాద్, డీఎంఆర్ శేఖర్ ఉన్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Also Read : YS Sharmila : అందుకు సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి.. వైసీపీ నేతలపై షర్మిల ఫైర్

పొత్తుకు ఇబ్బంది కలిగేలా కొందరు వ్యాఖ్యలు..
లోకేశ్ సీఎం పదవి గురించి మాట్లాడినా నేను పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా అంటూ పవన్ కల్యాణ్ అన్నారు. పొత్తుకు ఇబ్బందులు కలిగేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు..పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాం.. కొన్నిసార్లు ఆటుపోట్లు తప్పవు. పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మనం మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని పవన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతోనే నేను ఆగిపోవడం లేదు.. భవిష్యత్ లోకూడా టీడీపీతో పొత్తు కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు.. ఏమీ తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చానని అనుకుంటున్నారా అంటూ జనసైనికులను పవన్ ప్రశ్నించారు.

Also Read : Governor Tamilisai : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీచేసినోళ్లం.. గత ఎన్నికల్లో 18లక్షల ఓట్లు సంపాదించాం. మనం ఒంటరిగా పోటీచేస్తే సీట్లు సాధిస్తాం. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని పవన్ అన్నారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదు. టీడీపీతోపాటు జగన్ మనల్ని కూడా వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మన్నలి వదులుతాడా? వైఎస్ జగన్ కు ఊరంతా శత్రువులే ఉన్నారు. వైసీపీ నేతలకు కష్టం వస్తే నా దగ్గరకు రావాలంటూ అన్నారు.