YS Sharmila : అందుకు సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి.. వైసీపీ నేతలపై షర్మిల ఫైర్

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.

YS Sharmila : అందుకు సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి.. వైసీపీ నేతలపై షర్మిల ఫైర్

YS Sharmila

AP Politics : కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రరత్న భవన్ లో గణంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు రఘువీరా, పల్లం రాజు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజులతో కలిసి షర్మిల పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని అన్నారు. నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదని విమర్శించారు.

Also Read : Padma Awards 2024: తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను వైఎస్ కూతుర్ని అయినప్పుడు వైఎష్ షర్మిలలా కాకుండా ఎలా ఉంటాను. నా కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా. నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డికూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు. అన్నా.. కొండా అన్నా.. మీరు ప్రమాణం చేయగలరా? మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలను అంటూ షర్మిల సవాల్ చేశారు.

Also Read : షర్మిలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, వైఎస్ పోలికలు కనిపిస్తున్నాయి- ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారు. నేను ఏమీ ఆశించి ఈరోజువరకూ నా అన్న(జగన్) వద్దకు వెళ్లలేదు. దానికి సాక్ష్యం మా అమ్మే. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండంటూ షర్మిల సూచించారు. ప్రభుత్వాలు పెద్దపెద్ద విగ్రహాలు పెడుతున్నాయి.. కానీ, సమాజంలో సోషల్ జస్టిస్ వందశాతం లేదని షర్మిల అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు గుండుకొట్టి అవమానిస్తున్నారని షర్మిల ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.