Pawan Kalyan: ఎన్నికల వేళ.. భీమవరానికి పవన్ కల్యాణ్..

పవన్ కల్యాణ్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి బ్రేక్ ఫాస్ట్‌కు ఆహ్వానించారు. రేపు ఉదయం..

Pawan Kalyan: ఎన్నికల వేళ.. భీమవరానికి పవన్ కల్యాణ్..

Pawan Kalyan

Updated On : February 20, 2024 / 7:15 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. పవన్ కల్యాణ్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి బ్రేక్ ఫాస్ట్‌కు ఆహ్వానించారు. రేపు ఉదయం సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లి, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇంటికి వెళ్తారు పవన్ కల్యాణ్.

ఆయనతో మర్యాదపూర్వక భేటీ అనంతరం పెద అమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన నేతలతో సమావేశాల అనంతరం రాత్రికి భీమవరంలోనే బస చేయనున్నారు.

పవన్ కల్యాణ్ టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేక భేటీల్లో పాల్గొంటారు. ఇప్పటికే ప్రభుత్వం కాస్మో పాలిటిన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ ఇప్పకేటి ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. కాగా, అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి టీడీపీ-జనసేన సిద్ధమవుతోంది. పొత్తులపై బీజేపీ నుంచి స్పష్టతరాగానే ఆయా పార్టీల అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.

Read Also: నాతో చర్చకు సిద్ధమా? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్