Pawan Kalyan: ఇలాగైతే వైసీపీ నేతలు జర్మనీకి వెళ్లిపోవడం బెటర్.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

భవిష్యత్తులో కూడా ఇటువంటి పనులు చేయకూడదని పవన్ కల్యాణ్ సూచించారు.

Pawan Kalyan: ఇలాగైతే వైసీపీ నేతలు జర్మనీకి వెళ్లిపోవడం బెటర్.. ఎందుకంటే..: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

Pawan Kalyan

Updated On : February 24, 2025 / 1:28 PM IST

గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతలు అరుపులు, కేకలు పెట్టడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ నేతల తీరు బాగోలేదని అన్నారు.

వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, అయినప్పటికీ ప్రతిపక్ష హోదా అడుగుతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. “ఇలా జరగాలని అనుకుంటే వారు జర్మనీకి వెళ్లిపోవాలి. జర్మనీలో రూల్స్ వేరేలా ఉంటాయి. అసెంబ్లీ స్థానాలను బట్టి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్ల శాతాన్ని మిగతా వాళ్లు పంచుకుంటారు. ఇలాంటి రూల్స్ ఇండియాలో లేవు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ నేతలు మంకిపట్టుపడితే వారు జర్మనీకి వెళ్లిపోవచ్చు” అని పవన్ చెప్పారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెల్లాలని ఎద్దేవా చేశారు.

Also Read: ఐఫోన్ 17 CAD రెండర్‌లు లీక్.. వావ్‌.. ఇంత అద్భుతమైన ఫీచర్లా.. కెవ్వు కేక..

“భవిష్యత్తులో కూడా ఇటువంటి పనులు చేయకూడదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ 11 సీట్లు మీకు వచ్చాయి. దాన్ని గౌరవించి సభకు రండి. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ వైసీపీకి అవకాశం వస్తుంది. ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవలన్నది లో లెవెల్ ఆలోచన. ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించండి.

ప్రతిపక్ష హోదా ఈ ఐదేళ్లలో మీకు రాదు. 11 సీట్లతో ఆ హోదారాదు. ఇది చంద్రబాబు, జనసేన నిర్ణయం తీసుకునే విషయం కాదు. దానికి రూల్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎన్డీఏ నేతలు అందరూ వెళ్లినప్పుడు నేను నాయకుడి స్థాయిలో కూర్చున్నాను.

అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నన్ను ప్రధాన మంత్రి పక్కన కూర్చోబెట్టలేదు. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ అది మంత్రి హోదానే కాబట్టి మంత్రుల వద్దే కూర్చోబెట్టారు. రూల్స్‌ అలా ఉంటాయి. స్పీకర్ ఇవాళ ఉదయం నాకు ఎదురు వచ్చారు తనతో పాటు ముందుకు తీసుకెళ్లబోయారు.

డిప్యూటీ సీఎంకి ఇటువంటి ప్రోటోకాల్ ఉండదని, నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అలాగే, రూల్స్‌ను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రవర్తించాలి. ప్రతిపక్ష హోదా అంటే చంద్రబాబు ఇచ్చేది కాదు” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తమకు లేని ప్రోటోకాల్‌ను తాము అడగబోమని చెప్పారు.