బీజేపీ అనుమతి లేదు : 3 రాజధానులపై వైసీపీది తప్పుడు ప్రచారం

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 05:18 AM IST
బీజేపీ అనుమతి లేదు : 3 రాజధానులపై వైసీపీది తప్పుడు ప్రచారం

Updated On : January 23, 2020 / 5:18 AM IST

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర

ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడారు. ఇవాళ(జనవరి 23,2020) బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని పవన్ కలిశారు. ఏపీ రాజకీయ పరిణామాలు, మూడు రాజధానులపై ఆయనతో చర్చించారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్.. మూడు రాజధానులపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదన్నారు. రాజధాని మార్పుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్ర పెద్దలను సంప్రదించకుండానే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మూడు రాజధానులపై ప్రధాని, హోంమంత్రి జోక్యం లేదన్నారు పవన్. రాజధాని రైతులకు అండగా నిలవాలని బీజేపీ, జనసేన నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు.  

కేంద్రానికి చెప్పే త్రీ కేపిటల్స్ చేశామని వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని పవన్ మండిపడ్డారు. రాజధాని వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని జేపీ నడ్డా చెప్పారని పవన్ తెలిపారు. ఇందులో ప్రదాని, హోంమంత్రి పాత్ర లేదన్నారు. వైసీపీ చెప్పే మూడు రాజధానులు వాళ్ల భూదాందాల కోసమే అని పవన్ ఆరోపించారు. రాజధాని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు బీజేపీ-జనసేన కలిసి లాంగ్ మార్చ్ చేస్తాయని పవన్ వెల్లడించారు.

వారం రోజుల వ్యవధిలోనే నిన్న(జనవరి 22,2020) రెండోసారి ఢిల్లీకి వెళ్లిన పవన్.. పలువురు కేంద్ర పెద్దలను కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణతో పాటు పొత్తుకి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు. పవన్ వెంట బీజేపీ నేతలు జీవీఎల్, పురందేశ్వరి, సునీల్ దేవ్ ధర్, కన్నా లక్ష్మీనారాయన.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

పవన్ కామెంట్స్ :
* రాజధాని మార్పుకి బీజేపీతో సంబంధం లేదు
* మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదు
* ప్రధాని అనుమతితోనే రాజధాని మారుస్తున్నామని వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారు

* మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదు
* రాజధాని మార్పు ప్రజల కోసం వైసీపీ నేతల భూదందా కోసం
* 5 కోట్ల మంది ప్రజలు, రైతుల కోసం ఫిబ్రవరి 2న బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్