Pawan On Taxes : డైలీ పైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ల ఆలోచనలా ఉంది? ప్రభుత్వంపై పవన్ విమర్శనాస్త్రాలు

వీటిని చూస్తుంటే డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాళ్ల ఆలోచనలా ఉందని ఎద్దేవా చేశారు పవన్. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకుంటే..

Pawan On Taxes : డైలీ పైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ల ఆలోచనలా ఉంది? ప్రభుత్వంపై పవన్ విమర్శనాస్త్రాలు

Pawan On Taxes

Updated On : March 19, 2022 / 12:24 AM IST

Pawan On Taxes : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీరుపై ఫైర్ అయ్యారు. విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ పవన్ విమర్శలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? పన్నులు.. అవును.. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ట్రాక్టర్లు వేసుకుని తిరగడాన్ని పవన్ ప్రశ్నించారు. ఇది దేన్ని సూచిస్తుందని? ట్విట్టర్ లో నిలదీశారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. పన్ను కట్టని వాళ్ల సామాన్లు తీసుకుపోతామని మున్సిపల్ వాహనాలకు బ్యానర్లు కట్టిన ఫొటోలు అందులో ఉన్నాయి. దీనిపై పవన్ తీవ్రంగా స్పందించారు. వీటిని చూస్తుంటే డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాళ్ల ఆలోచనలా ఉందని ఎద్దేవా చేశారు పవన్.

అంతేకాదు, కర్నూలు నగరంలో అనంత కాంప్లెక్స్ ముందు చెత్త పోసిన ఘటనపైనా పవన్ స్పందించారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదని అన్నారు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకుంటే, ఆ పన్ను వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందని విమర్శించారు. “కర్నూలులో వ్యాపారులు పన్ను చెల్లించలేదని, సిటీలోని చెత్తను తీసుకొచ్చి దుకాణాల ముందు పోసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే” అని పవన్ అన్నారు.