జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన పవన్.. తొలి బీఫారం ఎవరికిచ్చారంటే?

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా

జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన పవన్.. తొలి బీఫారం ఎవరికిచ్చారంటే?

Pawan Kalyan

Janasena Party Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ-ఫారాలను పవన్ కల్యాణ్ తన చేతులమీదుగా అందజేశారు. తొలి బీఫారంను తెనాలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు పవన్ కల్యాణ్ అందజేశారు. అయితే, పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్లు పార్టీ నేతలు తెలిపారు.

Also Read : Araku Lok Sabha Constituency : వైసీపీ కంచుకోటలో హైవోల్టేజ్ ఫైట్.. ఈసారి అందలమెవరికో?

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని నడిపారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని, వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. సమర్ధులైన అభ్యర్థులను పవన్ ఎంపిక చేశారని నాదెండ్ల అన్నారు.

Also Read : Etcherla Fight : పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఈసారి అక్కడ గెలుపు ఎవరిదో?