Pawan Kalyan : వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. పద్దతి మార్చుకోవాలి.. తాట తీస్తాం..
Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు
Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు.. వైసీపీ నేతల్లో కొంతమంది అంటే గౌరవం ఉంది. కానీ, కొంతమంది పద్దతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా ఒళ్లు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తులు తాటతీస్తాం అంటూ పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలను కలసి మోసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేనను గెలిపించిన ప్రతి ఒక్కరికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు జాతికోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకోసం కలిసి పనిచేశామని పవన్ చెప్పారు.
అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా 1.2కోట్ల ప్రజలకు నీరు అందనుందని, 30నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని పవన్ చెప్పారు. తెలుగు వారికోసం తెలుగు వారి ఐక్యత కోసం ఎంతో మంది జీవితాలను త్యాగాలచేసి పదవులు వదులుకున్న వ్యక్తులను మరవ కూడదు. అందుకే ఈ ప్రాజెక్టుకు ఆమర జీవి జలధార ప్రాజెక్టుగా నామకరణం చేశామని పవన్ చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను ఒక కూలానికే, నెల్లూరుకే పరిమితం చేశారని, ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని, అటువంటి మహనీయుడికి సరైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించామని, మహనీయులకు కులాలు చూడకూడదని పవన్ పేర్కొన్నారు.
జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. నేను ఉన్న సభలకు ప్రధానికూడా రావడానికి భయపడుతున్నారని పవన్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం గత ఎన్నికల సమయంలో తగ్గి ఉన్నాను. చాలా మంది.. పార్టీని అమ్మేశారని, ఇంకా ఏదోదో కామెంట్స్ చేశారు. అయినా నేను పట్టించుకోలేదు. కేవలం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నేను తగ్గానని పవన్ స్పష్టం చేశారు.
ఉన్న ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటున్నాం. పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్తులో ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మంచి నీటిపై దృష్టిసారించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పవన్ చెప్పారు. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కొంతమంది ఇప్పుడు కులాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎవరి బెదిరింపులకు పవన్ కల్యాణ్ బయపడడు.. ఇంటిలో నుండి బయటకు వచ్చే సమయంలోనే నేను తిరిగి వెళ్తాననే నమ్మకం లేదు అనే భావనతోనే నేను బయట వస్తాను. అనవసరంగా ఆరోపణలుచేసే కిరాయి గ్యాంగ్‌లకు యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ లాగా ట్రిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.
రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు. వైసీపీ నేతలలో కొంతమంది అంటే నాకు గౌరవం ఉంది. కానీ, కొంతమంది పద్దతి మార్చుకోవడం లేదు. బాధ్యత లేకుండా, ఒళ్లు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తుల తాట తీస్తాం. జనసేన కూడా ప్రభుత్వంలో భాగమనే గుర్తించాలి. ప్రస్తుతం కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఆ పద్దతి మార్చుకోవాలి. లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
