Pawan Kalyan: ఢిల్లీ చేరుకుని కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు.

Pawan Kalyan: ఢిల్లీ చేరుకుని కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : July 17, 2023 / 7:38 PM IST

Pawan Kalyan – NDA: లోక్‌సభ ఎన్నికల (Lok sabha election 2024) ముందు దేశంలో వీలైనన్ని పార్టీలను కలుపుకుని మరింత బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ (BJP) మంగళవారం సాయంత్రం ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జనసేన (JanaSena)కు కూడా ఆహ్వానం అందడంతో ఇందులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.

తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, పార్టీల మధ్య ఐక్యత, జనసేన పాత్రపై కూడా ఎన్డీఎ సమావేశంలో చర్చ జరగవచ్చని చెప్పారు. ఎన్డీఏ పాలసీలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై సందర్భం వచ్చినప్పుడు తాను చెబుతానని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ ఏదీ లేదని చెప్పారు. పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్