విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటా: పవన్ సంచలన కామెంట్స్‌

హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోవద్దని చెప్పారు.

విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటా: పవన్ సంచలన కామెంట్స్‌

Updated On : November 4, 2024 / 3:55 PM IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటానని అన్నారు.

హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోవద్దని చెప్పారు. “మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి. ఆడ పిల్లలను రేప్ చేస్తే మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏమి చెబుతుంది?” అని అన్నారు.

తెగే వరకు లాగకండి అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తాను అందరూ బాగుండాలనే కోరుకుంటానని, ఇది ప్రతీకారాలు తీర్చుకునే ప్రభుత్వం కాదని చెప్పారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టే సంయమనం పాటిస్తున్నామని తెలిపారు.

గత ఐదేళ్లలో 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి సీఎం మాట్లాడలేదని పవన్ అన్నారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

Pawan Kalyan : పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. జగన్‌పై సెటైర్లు