చంద్రబాబుకి పవన్ లేఖ.. ఇద్దరు జనసేన నేతల పేర్లను విప్‌లుగా ప్రతిపాదన

జనసేన నుంచి ప్రభుత్వ విప్‌లుగా గురించాలని కోరుతూ ఇద్దరి పేర్లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు.

చంద్రబాబుకి పవన్ లేఖ.. ఇద్దరు జనసేన నేతల పేర్లను విప్‌లుగా ప్రతిపాదన

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ రాశారు. జనసేన నుంచి ప్రభుత్వ విప్‌లుగా బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌ను నియమించాలని కోరారు. నరసాపురం ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ ఉన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన నుంచి 21 మంది పోటీ చేస్తే వారందరూ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. కాగా, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

Also Read: జీతం తీసుకొని పనిచేద్దాం అనుకున్నాను.. కానీ ఇప్పుడు తీసుకోకూడదు అనుకుంటున్నాను..

ఇద్దరు కొత్తవారికే విప్ పదవుల కోసం పవన్ కల్యాణ్ ప్రతిపాదన చేశారు. తెలుగు దేశం పార్టీ నేతల్లో విప్ పదవులకు చంద్రబాబు నాయుడు ఎంపిక చేయాల్సి ఉంది. త్వరలోనే వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి పదవి ఆశించి దక్కని వారిని విప్‌గా నియమించే అవకాశం ఉంది.

Also Read: అందుకే జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు: కేటీఆర్