Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్

రుపతిలోని రేణిగుంట (Renigunta) విమానాశ్రయం వద్ద మీడియాతో పవన్ మాట్లాడారు.

Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : July 17, 2023 / 3:52 PM IST

Pawan Kalyan – JanaSena: సీఐ అంజూ యాదవ్‌(CI Anju Yadav)పై ఫిర్యాదు చేశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాళహస్తి(Srikalahasti)లో జనసేన నాయకులపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, కొట్టే సాయిని కొట్టారు.

దీంతో ఇవాళ అంజూ యాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. అనంతరం తిరుపతిలోని రేణిగుంట (Renigunta) విమానాశ్రయం వద్ద మీడియాతో పవన్ మాట్లాడారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఆయుధాలు లేకుండా, శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. అంజూ యాదవ్ ప్రవర్తన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

తమ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారని తెలిపారు. కానీ సీఐ రాజ్యాంగ విరుద్ధంగా సాయిని కొట్టారని అన్నారు. పోలీసులకు ప్రభుత్వం నుంచి ఓత్తిడి ఉంటుందని, దాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకుంటామని చెప్పారు. సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కుల సంఘానికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. జనసేన పార్టీ క్రమశిక్షణ తో ఉంటుందని, పోలీసులు కూడా క్రమశిక్షణతో లా అండ్ ఆర్డర్ ని కాపాడాలని చెప్పారు.

Chikoti Praveen Security Personnel : చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు