Kodali Nani : పవన్ కల్యాణ్‌కి ఆ మూడక్షరాల కోరిక ఉంది, అందుకే చంద్రబాబుతో కలిసి పోటీ- కొడాలి నాని
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవటానికి జనసేన కార్యకర్తలు తన్నులు తిన్నా పర్వాలేదు. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. Kodali Nani

Kodali Nani
Kodali Nani – Pawan Kalyan : వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కొడాలి నాని మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా నిప్పులు చెరిగారు. ఆ ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొడాలి నాని. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు 18 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని, అధ్యక్షా అని అనాలని కోరిక ఉంది. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా పట్టుకోలేడు పవన్ కల్యాణ్. ఈ విషయం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు. అందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు కొడాలి నాని.
Also Read : చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
జనసేన కార్యకర్తలు తన్నులు తిన్నా పర్వాలేదు. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఎవరు ఏమైనా పర్లేదు. తాను ఎమ్మెల్యే కావాలి అన్నది పవన్ కోరిక. పవన్ ఎమ్మెల్యే అవటం కోసం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆ ఇద్దరూ కలిసి పోటీ చేయనున్నారు అని కొడాలి నాని వివరించారు.
Also Read : టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్ రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?