Pawan Kalyan: నేను మాట్లాడితే ఎదురుదాడికి దిగారు.. మరి వీటిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు?: పవన్

దీనిపై సీఎం జగన్, హోమ్ శాఖ మంత్రి, మహిళా కమిషన్ బాధ్యురాలుగానీ ఎందుకు స్పందించటం లేదని అన్నారు.

Pawan Kalyan: నేను మాట్లాడితే ఎదురుదాడికి దిగారు.. మరి వీటిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు?: పవన్

Pawan Kalyan

Updated On : September 27, 2023 / 8:39 PM IST

Pawan Kalyan – JanaSena: ఆంధ్రప్రదేశ్‌లో తాను వాలంటీర్ల తీరు గురించి, ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడిన సమయంలో ప్రతి విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రభుత్వం, మహిళా కమిషన్.. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాల పట్ల మాత్రం ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలదీశారు.

ఏపీలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని కిరాతకంగా హత్యకు గురైందని, దీనిపై సీఎం జగన్, హోమ్ శాఖ మంత్రి, మహిళా కమిషన్ బాధ్యురాలుగానీ ఎందుకు స్పందించటం లేదని అన్నారు.

ఈ కేసులో ఆ బాలికది అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వస్తున్నాయన్నారు. బాధితురాలి తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఏపీలోని విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలచి వేసిందని అన్నారు.

Ramesh Bidhuri: బీఎస్పీ ఎంపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి ఉన్నత బాధ్యతలు