Varahi Yatra: అంబేద్కర్ పేరు పెట్టడానికి పెద్ద గొడవే చేశారు.. కోనసీమ జిల్లాలో పవన్

కోనసీమలో అడుగు పెట్టినప్పుడు కోనసీమ వాడి వేడి తట్టుకోవడం నాకు కూడా కష్టం అయ్యిందని పవన్ అన్నారు. తాను ఓడిపోయిన రాజకీయాల్లో ఉండిపోవడానికి అభిమానుల ప్రేమ కవచంలా పని చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో 35వేల పైచిలుకు ఓట్లు ఈ ప్రాంతం నుండి వేసి తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు

Varahi Yatra: అంబేద్కర్ పేరు పెట్టడానికి పెద్ద గొడవే చేశారు.. కోనసీమ జిల్లాలో పవన్

Pawan Kalyan

Updated On : June 23, 2023 / 7:19 AM IST

Pawan kalyan: కోనసీమ జిల్లకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడానికి చాలా పెద్ద గొడవే చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం కోసం చేసిన పోరాటంలో 250 మందిపై నమోదైన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం పవన్ మాట్లాడుతూ తాను ఓడిపోయినప్పటికీ రాజకీయాల్లో ఉండిపోవడానికి అభిమానుల ప్రేమ కవచంలా పని చేసిందని అన్నారు.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు షాక్.. మళ్లీ జైలు తప్పేలా లేదు

‘‘మహానుభవుడు అంబెడ్కర్ పేరు పెట్టడానికి చాలా పెద్ద గొడవ చేశారు. కోనసీమ అల్లర్ల కేసులో 250 మంది మీద పెట్టిన కేసులు ఎత్తేయండి. గొడవలు పెంచే వాడు నాయకుడు కాదు, గొడవలు తగ్గించే వాడు నాయకుడు’’ అని పవన్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘సీపీఎస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్నా పెద్దమనిషి ఎందుకు చేయలేదు? జనసేన అధికారంలోకి రాగానే సీపీఎస్ సంపూర్ణంగా రద్దు చేస్తాం. ఇన్ని వేల కోట్ల ఆయిల్ నిక్షేపాలు ఈ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. అయినా ఈ ప్రాంతంలో సరైన ఆసుపత్రులు లేవు’’ అని అన్నారు.

CM KCR : సమైక్యవాదులు నాపై లెక్కలేనన్ని దాడులు చేశారు, నన్ను భయపెట్టారు- సీఎం కేసీఆర్

ఇక గురువారం కోనసీమలో అడుగు పెట్టినప్పుడు కోనసీమ వాడి వేడి తట్టుకోవడం నాకు కూడా కష్టం అయ్యిందని పవన్ అన్నారు. తాను ఓడిపోయిన రాజకీయాల్లో ఉండిపోవడానికి అభిమానుల ప్రేమ కవచంలా పని చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో 35వేల పైచిలుకు ఓట్లు ఈ ప్రాంతం నుండి వేసి తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ విభజన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దృష్టి ఉభయ గోదావరి జిల్లాల పైన ఉందని, రాజకీయంగా ఈ ప్రాంతం కీలకమని పవన్ అన్నారు.