Pawan kalyan : మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలాఖాలో పవన్ కల్యాణ్ .. నేతలతో చర్చలు

Pawan kalyan : మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలాఖాలో పవన్ కల్యాణ్ .. నేతలతో చర్చలు

pawan kalyan kottu satyanarayana

Pawan kalyan Varahi Yatra : జనసేన (Jansena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan)మొదటి విడత వారాహి యాత్ర (Varahi Yatra)పూర్తి చేసుకుని రెండో విడతయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి వారాహిపై  పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలు వారాహి యాత్రలో భాగంగా పవన్ వైసీపీ ప్రభుత్వం (YCP Govt)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలు సవాళ్లు విసిరారు.

రెండో విడత వారాహి యాత్రకు షెడ్యూల్ ఖరారు కావటంతో ఏలూరుతో పాటు ఆ చుట్టు పక్కల నియోజక వర్గాల్లోని జనసేన నేతలతో  పవన్ చర్చలు జరుపనన్నారు.  ఏలూరు( Eluru), దెందులూరు(Dendulur), తాడేపల్లి గూడెం(Tadepalli Gudem), తణుకు( Tanuku )ఉంగుటూరు (Ungutur )నియోజకవర్గాల్లోని జనసేన నేతలతో  సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానికంగా పార్టీ బలోపేతంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై చర్చలు జరుపనున్నారు. అన్ని ప్రాంతాల్లోని పరిస్థితులు తెలుసుకుని ఇక విమర్శనాస్త్రాలతో సిద్ధమవుతున్నారు.

దీంతో ఇక మరోసారి పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఈ రెండో విడత వారాహి యాత్ర కూడా మరింత హీటెక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana)ఆ ప్రాంత నేతే. తాడేపల్లి గూడెం(tadepalligudem)కు చెందిన వైసీపీ నేత.  గతంలో పలుమార్లు పోటీ చేసిన ఓడిపోయిన 2019 ఎన్నికల్లో తాడేపల్లి గూడెం నియోజవర్గం(Tadepalli Gudem Constituency)నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. జగన్ (CM Jagan)కేబినెట్ లో దేవాదయా శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు. పవన్ పై తరచు సెటైర్లతో విరుచుపడుతు ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి తాడేపల్లి గూడెంలో పర్యటలో పవన్ ఎటువంటి విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడతారో వేచి చూడాలి. ఏది ఏమైనా మలి విడత వారాహి యాత్ర మరింత హీటెక్కించేలా ఉందని తెలుస్తోంది.

కాగా రెండో విడత వారాహి విజయ యాత్రను ఆదివారం (జులై9,2023) ఏలూరు నగరం నుంచి ప్రారంభించనున్నట్లుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అదే రోజు సాయంత్రం ఏలూరులో బహిరంగసభ ఉంటుందని పేర్కొంది జనసేన పార్టీ. 9 సాయంత్రం 5గంటలకు పవన్ కల్యాణ్‌ బహిరంగసభతో యాత్రను మొదలుపెట్టనున్నారు.