East Godavari : వైసీపీ కార్యకర్త ఆత్మహత్యతో ఉద్రిక్తత.. పోలీసులపై ప్రజలు రాళ్ల దాడి

కొవ్వూరు నియోజకవర్గంలోని దోమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణ అనంతరం దళిత యువకుడు, వైసీపీ కార్యకర్త బొంత మహేందర్ (23) పురుగుల మందు సేవించారు.

East Godavari : వైసీపీ కార్యకర్త ఆత్మహత్యతో ఉద్రిక్తత.. పోలీసులపై ప్రజలు రాళ్ల దాడి

People pelted stones on police

Updated On : November 16, 2023 / 7:40 AM IST

People Pelted Stones East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనిత ఇలాకలో పోలీసులపై ప్రజలు రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో అడిషనల్ ఎస్పీ సహా ఇతర పోలీసు సిబ్బంది, పలువురికి గాయాలు అయ్యాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని దోమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

వైసీపీ ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణ అనంతరం దళిత యువకుడు, వైసీపీ కార్యకర్త బొంత మహేందర్ (23) పురుగుల మందు సేవించారు. అతన్ని చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. బుధవారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మహేందర్ మృతదేహాన్ని విజయవాడ నుండి దొమ్మేరుకు తరలించారు.

Chandrababu : చంద్రబాబుకు గుండె సమస్య, 5 వారాల రెస్ట్ అవసరం.. హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత

మృతదేహాన్ని రోడ్డు మీద ఉంచి గ్రామస్తులు, జనసేన ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆందోళన చేపట్టారు. దొమ్మేరు గ్రామంలో కొందరి ఒత్తిడి వల్లే పోలీసులు వేధించారని ఆరోపణలు చేశారు. మహేందర్ మరణానికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. చీకట్లో రాళ్ల దాడిలో అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు సహా నలుగురు కానిస్టేబుళ్ళకు గాయాలు అయ్యాయి. బొంత మహేందర్ మృతి ఘటనలో ఎస్సై భూషణంను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.