హైదరాబాద్‌లో జడ్జి కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Hyderabad Judge Attack : సోమవారం జడ్జి కారులో వెళుతుండగా చంచల్ గూడ జైలు సమీపంలో గుర్తు తెలియని యువకుడు బైక్ పై వచ్చి కారును అడ్డగించాడు.

హైదరాబాద్‌లో జడ్జి కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Hyderabad Judge Attack

Updated On : October 9, 2025 / 11:26 AM IST

Hyderabad Judge Attack : నాంపల్లి క్రిమినల్ కోర్టు XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదన్న పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోమవారం జడ్జి కారులో వెళుతుండగా చంచల్ గూడ జైలు సమీపంలో గుర్తు తెలియని యువకుడు బైక్ పై వచ్చి కారును అడ్డగించాడు. కారు అద్దాలు కొడుతూ బూతులు తిట్టసాగాడు. జడ్జి కారులో ఉన్నారని డ్రైవర్ చెప్పినా వినకుండా సదరు వ్యక్తి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కారు డ్రైవర్ మాదన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జడ్జి కారుపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ లు సేకరించి పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో న్యాయ వ్యవస్థకు చెందిన వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జడ్జిల భద్రతపై పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.

Also Read: Nayanthara: ఇండస్ట్రీలో 22 ఏళ్ళు.. నన్ను నన్నుగా మార్చాయి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార