జేబుకు చిల్లు : ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఏపీలో వాహనాలు ఉపయోగించే వారి జేబుకు మరింత చిల్లు పడనుంది. ఎందుకంటే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న వ్యాట్ ధరలను పెంచింది. పెట్రోల్‌పై లీటర్‌కు 76 పైసలు, డీజిల్‌పై రూపాయి 7 పైసలు (VAT) పెంచుతూ..ప్రభుత్వం 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై 31 శాతం పన్ను కొనసాగుతోంది. దీనిలో ఎలాంటి మార్పు చేయలేకపోయినా..పన్ను (VAT) తో పాటు వసూలు చేస్తున్న 2 రూపాయలను రూ. 2.76 పైసలకు ప్రభుత్వం సవరించింది.
అలాగే డీజిల్‌పై ప్రస్తుతం 22.25 శాతం పన్ను(VAT) ఉంటే..దీనికి అదనంగా రూ. 2 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిని రూ. 3కి (22.25+3.07) పెంచింది. అంటే డీజిల్ ధర రూ. 1.07 మేర పెరగనుంది.
ఏపీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 76.43 కొనసాగుతోంది. తాజాగా సవరించిన ధరల ప్రకారం ఇది 76 పైసల మేర పెరగనున్నట్లు అంచనా. లీటర్ డీజిల్ ధర ప్రస్తుతం రూ. 70.63 ఉండగా..తాజా ధరల ప్రకారం మరో రూపాయి పెరగనుంది. మార్చి 01వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
Read More : టీడీపీకి జగన్ కౌంటర్ : అంబానీతో భేటీ..అజెండా ఏంటీ