Petrol Home Delivery: పెట్రోల్ హోమ్ డెలివరీ.. విజయవాడలోనే ప్రారంభం

పెట్రోల్‌, డిజీల్‌‌ను హోం డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(BPCL‌).

Petrol Home Delivery: పెట్రోల్ హోమ్ డెలివరీ.. విజయవాడలోనే ప్రారంభం

Door Delivery (1)

Updated On : December 29, 2021 / 12:01 PM IST

Petrol Home Delivery: పెట్రోల్‌, డిజీల్‌‌ను హోం డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(BPCL‌). ఈ కార్యక్రమాన్ని ముందుగా విజయవాడలో అందుబాటులోకి తీసుకుని వచ్చి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు బీపీసీఎల్‌ సౌత్‌ డీజీఎం రాఘవేంద్రరావు వెల్లడించారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫెసో క్యాన్‌లో పెట్రోల్, డీజిల్‌లను సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, తద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఉండదని రాఘవేంద్రరావు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ డీజీఎం భాస్కరరావులు పాల్గొన్నారు.

విజయవాడలోని గాంధీనగర్‌ పెట్రోల్‌ బంకులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అధికారులు. గాంధీనగర్‌ పెట్రోల్ బంక్‌లో సిబ్బందితో పనిలేకుండా స్కాన్‌ చేసి పెట్రోల్‌ నింపుకునే విధానాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.