Corona Medicine: విరివిగా మార్కెట్లో అందుబాటులో కరోనా మెడిసిన్ “మోల్నుపిరవిర్”
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి.

Covid
Corona Medicine: దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొత్తరకం వేరియంట్ ఓమిక్రాన్ కూడా విజృంభిస్తున్న తరుణంలో.. అత్యవసర మందులకు డిమాండ్ ఏర్పడింది. కరోనా రెండో దశ సమయంలో మందులు లభించక ప్రజలు నానా అవస్థలుపడ్డారు. “రెమెడిసివిర్” ఇంజక్షన్ దొరికితేచాలు గండం గడిచినట్లే అని భావించారు అనేక మంది కరోనా బాధితులు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో మందుల కొరత రాకుండా ప్రభుత్వాలు సైతం చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో కరోనా చికిత్సలో వినియోగించే ఔషధాలను తయారు చేసే సంస్థలకు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి. దేశీయ ఫార్మా దిగ్గజం ఆరోబిందో ఫార్మా, మరో ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ తో కలిసి మోల్నుపిరవిర్ మెడిసిన్ ను తయారు చేసింది. “మోల్నాఫ్లూ”గా పిలిచే ఈ క్యాప్సూల్ కరోనా బాధితులకు అత్యవసర సమయంలో వినియోగించవచ్చు.
Also Read: Funds Sanctioned : పోలవరం నిధులు మంజూరు
మరోవైపు అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన మరో కరోనా మందు “పాక్స్ లోవిడ్”ని దేశీయ విఫణిలోకి తీసుకొచ్చేందుకు భారత ఫార్మా సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. “మోల్నుపిరవిర్” కంటే మరింత ప్రభావవంతంగా పనిచేసే ఈ “పాక్స్ లోవిడ్” కరోనాలోని ఇతర వేరియంట్ల పై సమర్ధవంతంగా పనిచేస్తునట్లు ఫైజర్ సంస్థ ప్రకటించింది. కరోనా సోకినా ప్రాణాపాయం నుంచి తప్పించే అవకాశం ఈ “పాక్స్ లోవిడ్”లో మెండుగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో త్వరితగతిన తీసుకొచ్చేందుకు ఫార్మా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
Also read: Amritsar Police : లూడో లవ్ స్టోరీ…యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేసి…