Funds Sanctioned : పోలవరం నిధులు మంజూరు

వచ్చే బడ్జెట్‌లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. నేడు లేదా రేపు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి.

Funds Sanctioned : పోలవరం నిధులు మంజూరు

Polavaram

sanctioned funds for Polavaram : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. 320 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే బడ్జెట్‌లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నిధులు ఇవాళ లేదా రేపు రాష్ట్ర ఖజానాకు చేరనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. మొదటి రోజు మోదీతో పాటు నిర్మలా సీతారామన్‌, జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ అయిన సీఎం.. మంగళవారం మరో ముగ్గురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం.. ఏపీలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, నూతన విద్యా విధానం అమలుపై చర్చించారు.

CM Jagan : మూడు రోజుల్లోనే పీఆర్సీ ప్రకటన..!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని..ఏపీకి కేటాయించాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తోనూ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు అంశాలపై దాదాపు అరగంట సేపు చర్చించారు. అంతకుముందు రోడ్డు, ఉపరితల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటి అయ్యారు.

ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణపై గడ్కరీతో దాదాపు గంట సేపు చర్చించారు. సముద్ర తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపరం వరకు నేషనల్‌ హైవే, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటు పైనా చర్చించారు.