మీకు ఇవాళే మెసేజ్‌ వచ్చేసిందా? మీ బ్యాంక్‌ అకౌంట్‌లో పీఎం కిసాన్‌ రూ.2 వేలతో పాటు మరో రూ.5 వేలు పడబోతున్నాయ్‌..

ఫండ్స్‌ రిలీజ్‌ చేయడానికి ఒకరోజు ముందే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఏపీలో రైతులకు మొత్తం రూ.7 వేలు పడతాయి.

మీకు ఇవాళే మెసేజ్‌ వచ్చేసిందా? మీ బ్యాంక్‌ అకౌంట్‌లో పీఎం కిసాన్‌ రూ.2 వేలతో పాటు మరో రూ.5 వేలు పడబోతున్నాయ్‌..

Updated On : November 18, 2025 / 9:30 AM IST

​PM Kisan: పీఎం కిసాన్ 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రిలీజ్ చేయనున్నారు. కేంద్ర సర్కారు ప్రతి ఏడాది రైతులకు రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ విడతతో కేంద్రం ఇచ్చిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లు దాటనుంది.

ఏపీలో పీఎం కిసాన్‌-అన్నదాతా సుఖీభవ నిధులు
ఏపీలో బుధవారం పీఎం కిసాన్‌-అన్నదాతా సుఖీభవ ఫండ్స్‌ రిలీజ్ కానున్నాయి. కేంద్ర సర్కారు ఇస్తున్న రూ.2 వేలతో పాటు ఏపీ సర్కారు మరో రూ.5 వేల చొప్పున జమ చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు ఈ ఫండ్స్‌ విడుదల చేస్తారు.

Also Read: కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

ఏపీ వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు మొత్తం రూ.7 వేల చొప్పున విడుదల అవుతాయి. మొత్తం కలిపి రూ.3,135 కోట్లు జమ చేయనున్నట్లు ఏపీ సర్కారు చెప్పింది. ఇప్పటికే ఈ పథకం కింద ఆగస్టులో తొలి విడతగా రూ.3,174 కోట్లు రిలీజ్ అయ్యాయి.

పీఎం కిసాన్‌-అన్నదాతా సుఖీభవ ఫండ్స్‌ రిలీజ్ ప్రోగ్రాంను ఏపీలోని 10,000కు పైగా రైతు సేవా కేంద్రాల్లో లైవ్‌లో చూపాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఫండ్స్‌ రిలీజ్‌ చేయడానికి ఒకరోజు ముందే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాలని అధికారులకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.