కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతోంది. నేటి నుంచి మరింత పెరగనుంది.

కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

Updated On : November 18, 2025 / 8:14 AM IST

Weather Updates: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం కదులుతోంది.

దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, పొట్టి శ్రీరాముల జిల్లా, చిత్తూరు జిల్లాల్లో పడుతుందని, అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. (Weather Updates)

Also Read: ఢిల్లీ పేలుడుకు ముందే భారత్‌పై దాడులకు.. హమాస్‌ తరహా వ్యూహ రచన.. భయంకర నిజాలు వెల్లడి

మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతోంది. నేటి నుంచి మరింత పెరగనుంది. ప్రజలు సాయంత్రం 6 గంట నుంచి ఉదయం 8 గంటలలోపు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తెలంగాణలో రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీల తక్కువగా రికార్డయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ చలితీవ్రత పెరిగిపోతోంది.