AP Police : భువనేశ్వరి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ap Police
AP Police : చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులో ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ, కోదాడ ప్రాంతాల్లో అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆరు రోజుల క్రితం తిరుపతి రూయా ఆసుపత్రి వెనక పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహం కనిపించింది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన పూర్తిగా కాలిపోయి ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. సెల్ ఫోన్ ఆధారంగా మృతురాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భువనేశ్వరిగా గుర్తించారు. భర్త శ్రీకాంత్ భువనేశ్వరిని ఇంట్లోనే హత్యచేసి రుయా ఆస్పత్రి వెనకభాగంలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో మృతదేహాన్ని కాల్చినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం విజయవాడ, కోదాడ మధ్య అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తిరుపతికి తరలించారు.