Crime News: పార్సిల్‌లో మహిళ ఇంటికి డెడ్ బాడీ కేసు.. అనుమానిత నిందితుడి అరెస్ట్
హత్య ఎందుకు చేశాడు? పార్సిల్‌ను తులసికి ఎందుకు పంపాడు అనే కోణంలో శ్రీధర్ వర్మను విచారిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళ ఇంటికి డెడ్ బాడీ పార్సిల్‌గా వచ్చిన కేసులో పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళ ఇంటికి పార్సిల్‌లో గుర్తుతెలియని మృతదేహం వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు మచిలీపట్నం-బంటుమిల్లి సమీపంలో అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సాగి తులసికి పార్సిల్‌లో వచ్చిన ఆ మృతదేహం కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన బర్రె పర్లయ్యదిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
డెడ్ బాడీ పార్సిల్ వచ్చిన తర్వాతి నుంచి సాగి తులసి చెల్లెలు రేవతి భర్త తిరుమాని శ్రీధర్ వర్మ పరారీలో ఉన్నారు. పర్లయ్య(మృతుడు)ను కొన్ని రోజుల క్రితం పనుల నిమిత్తం శ్రీధర్ వర్మ తీసుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన శ్రీధర్ వర్మను పోలీసులు విచారిస్తున్నారు. హత్య ఎందుకు చేశాడు? పార్సిల్‌ను తులసికి ఎందుకు పంపాడు అనే కోణంలో శ్రీధర్ వర్మను విచారిస్తున్నారు.
కాగా, గత కొన్ని రోజుల తులసి ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించారు. మొదట మృతదేహం ఆచూకీ తెలియక పోవడంతో పక్క జిల్లాల్లో గత కొన్ని రోజులుగా నమోదైన మిస్సింగ్ కేసులను కూడా పరిశీలించారు. తులసి పనిచేసే ప్రాంతంలో, బంధువులను కూడా విచారించారు.
అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి భేటీ.. ఈ అంశాలపై చర్చ