Dharmana Prasada Rao : వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
Dharmana Prasada Rao : వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Police Case Registered Against YCP Leader Dharmana Prasada Rao
Dharmana Prasada Rao : వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం హుద్‌హుద్ తుపాను బాధితులకోసం నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశాల వ్యవహారంలో ఆయనపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read : Ap PMAY Scheme: ఏపీ పేదలకు తీపి కబురు.. 4 లక్షల కొత్త ఇళ్లు మంజూరు.. వారంలోనే పట్టాల పంపిణీ!
మే 14న జరిగిన గృహ ప్రవేశాల ఘటనపై హౌసింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అనధికారికంగా ఇళ్లను ప్రారంభింప చేయించారనే ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై హౌసింగ్ పీడీ పోలీసులకు నివేదిక సమర్పించారు. హౌసింగ్ శాఖ ఈఈ సత్యాజీ ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ధర్మానపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
దర్యాప్తులో భాగంగా అవసరమైతే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ధర్మాన ప్రసాదరావు సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
