Crime News: పార్సిల్​లో మహిళ ఇంటికి డెడ్​ బాడీ కేసు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

సాగి తులసి మరిది వర్మ పరారీలో ఉన్నాడు. పార్సిల్ తెరవగానే జరిగిన పరిణామాల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు అతడు.

Crime News: పార్సిల్​లో మహిళ ఇంటికి డెడ్​ బాడీ కేసు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

Updated On : December 21, 2024 / 11:41 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళ ఇంటికి పార్సిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. పార్సిల్ డెడ్ బాడీ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు.

పార్సిల్‌ను ఆటోలో తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకుని ఉండి పోలీసులు విచారిస్తున్నారు. సాగి తులసి తల్లిదండ్రులను, చెల్లెలిని కూడా విచారిస్తున్నారు. సాగి తులసి మరిది వర్మ పరారీలో ఉన్నాడు. పార్సిల్ తెరవగానే జరిగిన పరిణామాల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు అతడు.

మృతదేహం ఎవరిది?
పార్సిల్ వచ్చిన మృతదేహం ఎవరిది అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత కొన్ని రోజుల తులసి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహం ఆచూకీ తెలియక పోవడంతో పక్క జిల్లాల్లో గత కొన్ని రోజులుగా నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు.

తులసి పనిచేసే ప్రాంతంలో, బంధువులను సైతం విచారించారు. తులసి ఫోన్ కు వచ్చిన మెసేజ్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ వాళ్లు పంపలేదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కుట్ర కోణంలోనే డెడ్ బాడీ పార్సెల్ వచ్చిందని భావిస్తున్నారు పోలీసులు.

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. భారీ బందోబస్తు