Vijayawada : చంద్రబాబుకు మద్దతుగా వాట్సాప్‎లో మేసేజ్‌లు.. విజయవాడలోని కాలేజీని చుట్టుముట్టిన పోలీసులు

ముందస్తు చర్యగా భారీ బలగాలను కళాశాల వద్ద మోహరింపజేశారు. Vijayawada - Police Forces

Vijayawada : చంద్రబాబుకు మద్దతుగా వాట్సాప్‎లో మేసేజ్‌లు.. విజయవాడలోని కాలేజీని చుట్టుముట్టిన పోలీసులు

Vijayawada Siddhartha Engineering College

Updated On : September 15, 2023 / 8:36 PM IST

Vijayawada – Police Forces : విజయవాడ సిద్ధార్ధ పీవీపీ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తారేమో అని అనుమానించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలలో ఎవరూ ఉండకూడదు అంటూ విద్యార్థులను బయటకు పంపేశారు పోలీసులు.

Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

చంద్రబాబుకి మద్దతుగా నిలవాలని విద్యార్థులు వాట్సాప్ లలో మేసేజ్ లు పెట్టుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ముందస్తు చర్యగా భారీ బలగాలను కళాశాల వద్ద మోహరింపజేశారు. విద్యార్థులు నిరసనలకు దిగకుండా ముందస్తుగా ఈ కట్టడి చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 20మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగమే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. చంద్రబాబు స్కామ్ చేశారని, అందుకు సాక్ష్యాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ అయ్యారని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు మాటే లేదని ఎదురుదాడికి దిగారు.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

కాగా, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు, చంద్రబాబు మద్దతుదారులు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు సైతం చంద్రబాబుకి మద్దుతుగా నిలవాలని నిర్ణయించారని, నిరసనకు సిద్ధమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కాలేజీని చుట్టుముట్టారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్యలు తీసుకున్నారు.