Tirupati Software Engineer: సాప్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో కీలక ములుపు.. ముగ్గురిపై కేసు నమోదు
తిరుపతి జిల్లాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులుగా భావిస్తున్న చాణిక్య ప్రతాప్‌తో పాటు గోపీనాథ్ రెడ్డి, రూపంజయపై కేసు నమోదు చేశారు. రుపుంజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న చాణిక్య ప్రతాప్, గోపినాథ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. వారు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో వారిని పట్టుకొనేందుకు పోలీసు టీం బెంగళూరుకు వెళ్లింది.

Tirupati Software Engineer
Tirupati Software Engineer: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం మొప్పరాజుపల్లి సమీపంలోని కరుపకణం వద్ద శనివారం అర్థరాత్రి సాప్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు హత్యకు గురైన విషయం విధితమే. కారులో ఉన్న నాగరాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతను అక్కడికక్కడే సజీవదహనం అయ్యాడు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నాగరాజు తమ్ముడు పురుషోత్తం అక్రమ సంబంధమే హత్యకు కారణమని తెలిసింది. ఇదే విషయాన్ని నాగరాజు భార్య సులోచన తెలిపింది. తన భర్త హత్యకు అతడి తమ్ముడు పురుషోత్తం వివాహేతర సంబంధమే కారణమని ఆమె తెలిపింది.
గ్రామానికి చెందిన మహిళతో పురుషోత్తంకు వివాహేతర సంబంధం ఉందని, కొద్దిరోజులుగా మహిళ బంధువులకు, పురుషోత్తంకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో నాగరాజు అడ్డుకొని పురుషోత్తంను బెంగళూరు పంపించారని తెలిపింది. అయితే, పురుషోత్తం గొడవ విషయంపై హత్యకు ముందురోజు రాత్రి గోపీ అనే వ్యక్తి నా భర్తకు ఫోన్ చేశాడని, పరుషోత్తం గొడవ విషయంపై మాట్లాడాలని, రాజీ చేసుకుందామని నాగరాజును రమ్మన్నాడని మృతుడి భార్య తెలిపింది. రాజీ చేస్తామని చెప్పి కారుతో సహా కాల్చేశారని, నా భర్తకు మరణానికి కారణమైన రిపుంజయ, చాణక్యప్రతాప్‌లను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసుల ఎదుట మొరపెట్టుకుంది. నాగరాజు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చాణిక్య ప్రతాప్‌తో పాటు గోపీనాథ్ రెడ్డి, రూపంజయపై ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్
ప్రస్తుతం పోలీసులు అదుపులో రుపుంజయ ఉన్నారు. చాణిక్య ప్రతాప్, గోపినాథ్‌రెడ్డి పరారీలో ఉన్నారు. వారు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. నిందితుల ఆచూకీకోసం పోలీసు టీం బెంగళూరుకు వెళ్లింది. కేసులో నిందితుడిగా ఉన్నగోపీనాథ్ రెడ్డి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గురైన నాగరాజును ఫోన్ చేసి మాట్లాడేందుకు గోపీనాథ్ రెడ్డి పిలిచినట్లు తెలుస్తోంది. గోపీనాథ్ రెడ్డి చెప్పడంతోనే బెంగళూరు నుంచి మృతుడు నాగరాజు స్వగ్రామానికి వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నాగరాజును హత్య చేయడానికి ముందే ప్లాన్ చేసుకొని పిలిపించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.