వేధింపుల కేసు.. పోలీసుల విచారణలో పలువురు ఐపీఎస్‌ల పేర్లు చెప్పిన ముంబై నటి..!

ఈ కేసులో కొందరు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ రాజకీయ నాయకులు ఎవరు?

వేధింపుల కేసు.. పోలీసుల విచారణలో పలువురు ఐపీఎస్‌ల పేర్లు చెప్పిన ముంబై నటి..!

Mumbai Actress Case : ముంబై నటి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విజయవాడ సీపీ ఆఫీసులో సినీ నటిని జెత్వానిని విచారిస్తున్నారు పోలీసులు. ఆమె నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. జెత్వాన్ని నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ముంబై హీరోయిన్ కు వేధింపుల కేసుని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆమెను ఎవరు నిర్బంధించారు? ఎవరెవరు వేధించారు? దీనికి సంబంధించి ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు పోలీసులు. రిటన్ స్టేట్ మెంట్ తీసుకోవడంతో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేశారు. వేధింపులకు సంబంధించి కీలక విషయాలను పోలీసుల దృష్టికి నటి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులతో పాటు అప్పుడు పోలీసుల అధికారులుగా ఉన్న కాంతి రానా టాటా, విశాల్ గున్నిల పేర్లను నటి జెత్వాని తన స్టేట్ మెంట్ లో చెప్పినట్లుగా సమాచారం. వారితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారని, వారి పేర్లు తనకు తెలియదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది.

కొంతమంది కావాలని తనపై తప్పుడు కథనాలు అల్లుతున్నారని, తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని, తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని నటి జెత్వాని పోలీసుల ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. ఒక డాక్టర్ గా, యాక్టర్ గా గౌరవ ప్రదమైన కుటుంబం నుంచి తాను వచ్చానని.. ఎవరైనా తన గురించి తప్పుగా ప్రచారం చేస్తే వారిపై లీగల్ గా వెళ్తానని నటి జెత్వాని చెప్పినట్లు సమాచారం.

ఇక ఈ కేసులో కొందరు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ రాజకీయ నాయకులు ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.

నటికి వేధింపుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది చంద్రబాబు సర్కార్. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఆ పోలీసు అధికారులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనేదానిపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జగన్ పాలనలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ముంబై నటి కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఆయన చెప్పారు.

Also Read : అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..! కాలేజీ యాజమాన్యం ఏమందంటే..