జూన్ 1న ఏపీకి సీఎం జగన్..! రెస్ట్ తర్వాత యాక్టివ్ మోడ్‌లోకి పార్టీల ప్రధాన నేతలు

సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు.

జూన్ 1న ఏపీకి సీఎం జగన్..! రెస్ట్ తర్వాత యాక్టివ్ మోడ్‌లోకి పార్టీల ప్రధాన నేతలు

Top Leaders Back To AP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం రెస్ట్ మోడ్ లోకి వెళ్లిన అన్ని పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుండటంతో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తున్నారు. 40 రోజులు ఏకధాటిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన నేతలు.. పోలింగ్ ముగియగానే పలు ప్రాంతాలకు వెళ్లారు. జూన్ 4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఆయా నేతలంతా తిరిగి వచ్చేస్తున్నారు.

సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండటంతో తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. పోలింగ్ తర్వాత వారం రోజులు బ్రేక్ తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాడేపల్లిగూడెం వచ్చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నేతలు సైతం జూన్ 1 నాటికి ఏపీకి చేరుకోనున్నారు.

సుదీర్ఘంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం.. వీటన్నింటి నిర్వహించి మండుటెండలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సీఎం జగన్.. మే 13న పోలింగ్ ముగిశాక.. 17న లండన్ పర్యటనకు వెళ్లారు. లండన్ నుంచి స్విట్జర్లాండ్, అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్లారు. ఇలా నేతలందరూ వెకేషన్ కు వెళ్లి రిలాక్స్ అయ్యారు.

ఇక జూన్ 4 కౌంటింగ్ ఉండబోతోంది. కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో వెకేషన్ కు వెళ్లిన నేతలంతా ఏపీకి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 31న అర్థరాత్రి సీఎం జగన్ లండన్ నుంచి తిరిగిరానున్నారు. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి వారం రోజుల పాటు వెకేషన్ కు వెళ్లారు. ఆయన తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెకేషన్ కు వెళ్లారు. కొందరు విదేశాలకు వెళ్లగా, మరికొందరు వేరే రాష్ట్రాలకు, ఇంకొందరు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనకు వెళ్లారు. వీరంతా కూడా జూన్ 1 నాటికి రాష్ట్రానికి చేరుకోబోతున్నారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సి అవసరం ఉంటుంది. దీంతో వారంతా 1వ తేదీ నాటికి తిరిగి వచ్చేస్తున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు అమెరికాతో పాటు ఇటలీ పర్యటనకు వెళ్లారు. ఆయన ఇవాళ రాత్రి లేదా రేపు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సైతం వెకేషన్ మూడ్ పూర్తి చేసుకుని సినిమాకు సంబంధించి షూటింగ్ లేదా ట్రైనింగ్ లో పాల్గొంటున్నట్లుగా సమాచారం. ముంబైలో ఫైట్ సీన్స్ షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. పురంధేశ్వరి కూడా 1వ తేదీ నాటికి రాజమండ్రికి చేరుకోబోతున్నారు. వైఎస్ షర్మిల కూడా 3వ తేదీకి కడప చేరుకోనున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికా పర్యటనలో ఉన్నారు. కీలక నేతలంతా తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.

సీఎం జగన్
* పోలింగ్ అనంతరం లండన్ వెళ్లిన సీఎం జగన్
* ఈ నెల 31 నాటికి తాడేపల్లి చేరుకుంటారు

చంద్రబాబు నాయుడు
* పోలింగ్ తర్వాత అమెరికా వెళ్లిన చంద్రబాబు
* మే 29న హైదరాబాద్ చేరుకుంటారు

పవన్ కల్యాణ్..
జూన్ 1న అమరావతి చేరుకుంటారు
అమరావతి నుంచే ఫలితాల పరిశీలన

వైఎస్ షర్మిల..
జూన్ 3న కడప చేరుకుంటారు
కడప క్యాంపు కార్యాలయం నుంచే ఎలక్షన్ రిజల్ట్ పరిశీలన

పురంధేశ్వరి..
జూన్ 3న రాజమండ్రి చేరుకుంటారు
రాజమండ్రి కార్యాలయం నుంచే ఎన్నికల ఫలితాలు పరిశీలన

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?