రైతులకు ఆడి కార్లు ఉండకూడదా? బంగారు గాజులు కొనుక్కోకూడదా? పోసాని వర్సెస్ పృథ్వీ

అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్‌లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్‌ పృథ్వీ రాజ్‌ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 01:30 AM IST
రైతులకు ఆడి కార్లు ఉండకూడదా? బంగారు గాజులు కొనుక్కోకూడదా? పోసాని వర్సెస్ పృథ్వీ

Updated On : January 11, 2020 / 1:30 AM IST

అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్‌లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్‌ పృథ్వీ రాజ్‌ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో

అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్‌లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్‌ పృథ్వీ రాజ్‌ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధానిలో రైతులు, మహిళల మీద పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరైనా ఆడి కార్లలో తిరుగుతారా? బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా అంటూ పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను పోసాని ఖండించారు. రైతులకు కార్లు ఉండకూడదా అని ప్రశ్నించారు. పొలం పని చేసే మహిళలు బంగారు గాజులు కొనుక్కోకూడదనా అని నిలదీశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు పృథ్వీ సిగ్గు పడాలని.. పృథ్వీకి ఏ మాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజధానిలో మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

పృథ్వీపై నాకు కక్ష లేదు:
పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న రైతులను రోడ్డుకీడ్చావంటూ పృథ్వీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, పృథ్వీపై తనకు ఎలాంటి కక్ష లేదన్నారు పోసాని. పోరాటం చేస్తున్న అమరావతి రైతుల పట్ల తప్పుగా మాట్లాడినందుకు రైతులకు, రైతు ఆడపడుచులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ మాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామిపై గౌరవం ఉన్నా వెంటనే అమరావతి రైతులు, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని.. అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని వ్యాఖ్యానించారు. 

సారీ చెప్పను:
పోసానికి పృథ్వీ కౌంటర్ ఇచ్చారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్న కామెంట్లను వెనక్కి తీసుకునేది లేదని, సారీ చెప్పనని తెగేసి చెప్పారు. అమరావతి ఆందోళనల్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని మరోసారి కామెంట్ చేశారు. తాను ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని స్పష్టం చేశారు. రైతులను తాను అవమాన పరచలేదని.. కేవలం బినామీ రైతులైన పెయిడ్ ఆర్టిస్టులపై మాత్రమే విమర్శలు చేశానని క్లారిటీ ఇచ్చారు. రైతులంటే తనకు గౌరవం ఉందన్నారు పృథ్వీ రాజ్. అమరావతిలో బినామీ రైతులు మీకు కనబడలేదా అంటూ పోసానిపై విమర్శలు గుప్పించారు.

భూములు తీసుకున్నప్పుడు పోసాని ఏమయ్యారు?
రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు స్పందించలేదని కౌంటర్‌ విసిరారు పృథ్వీరాజ్. తన వల్ల పార్టీ నష్టపోతుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, పోసానికి దమ్ముంటే ఏదైనా వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. వ్యవసాయం చేసే రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అనలేదన్నారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు ముమ్మాటికీ పెయిడ్‌ ఆర్టిస్టులేనని చెప్పారు. తనతో పాటు నటించిన వారు కూడా అమరావతి ఆందోళనల్లో ఉన్నారన్నారు పృథ్వీరాజ్. 

* పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం 
* పృథ్వీ రాజ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ పోసాని కృష్ణమురళి
* రైతులు, మహిళలపై పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని ఆగ్రహం 
* రైతులు ఆడి కార్లలో తిరుగుతారా?- పృథ్వీ
* బంగారు గాజులు వేసుకుని ధర్నాలు చేస్తారా?-పృథ్వీ 
* రైతులకు కార్లు ఉండకూడదా?-పోసాని
* మహిళ రైతులు బంగారు గాజులు కొనుక్కోకూడదా?-పోసాని
* మహిళలకు పృథ్వీ క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ 
* సారీ చెప్పేది లేదని తెగేసి చెప్పిన పృథ్వీ