Tirumala : నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ.. మాడ వీధులలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి.

Pournami Garuda Seva
Tirumala Garuda Seva : నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరుగనుంది. సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి 7 నుండి 9 గంటల వరకు మాడ వీధులలో గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిన్న(గురువారం) 54,620 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read : తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 2.98 కోట్లు వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.