కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తుండగా పవర్ కట్… గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో పవర్ కట్ అయింది. దీంతో వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితులు ఆందోళన చెందారు. కరెంట్ పోయిన సమయంలో జనరేటర్ పని చేయలేదని గాంధీ వైద్యులు చెప్పారు. 20 నిమిషాల తర్వాత పవర్ వచ్చిందని తెలిపారు.
మరోవైపు గాంధీ ఆస్పత్రిలో పవర్ కట్ పై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో జనరేటర్ల పనితీరును పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట అదనపు జనరేటర్లను అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటెల అన్నారు. గాంధీ… కరోనా స్పెషల్ ఆస్పత్రిగా ఉంది. గాంధీ ఆస్పత్రిలో దాదాపు 20 నిమిషాలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో కరోనా పాజిటివ్ పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక్కడ ట్రీట్ మెంట్ అందుకున్న వారిలో ఎక్కువగా సింప్టమాటిక్ పేషెంట్లు, కొంచెం కోమార్బిట్ పేషెంట్లు ఎక్కువగా కనిపిస్తారు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. వీరికి సంబంధించి పవన్ కట్ అయ్యే సరికి ఒక్కసారిగా ఆందోళనపడ్డారు. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్లినప్పుడు అది పని చేయకపోవడంతో ఈ గ్యాప్ వచ్చింది. వెంటనే మళ్లీ దాన్ని రీ కలెక్ట్ చేశామని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. అయితే దీనిపై వెంటనే మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు.
ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడానికి వీల్లేదని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. పూర్తిస్తాయిలో జనరేటర్లు ఏర్పాటు చేయాలి… లేనిపక్షంలో ఇప్పుడు ప్రత్యేకంగా జనరేటర్ ఏర్పాటు చేయాలి. ప్రత్యామ్నాయంగా రెంటెడ్ జనరేటర్ అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేధించారు.