ఆపరేషన్ అండర్ వాటర్.. బోట్లను ముక్కలు చేసే పనులు ప్రారంభం.. ఎలా కట్ చేస్తారంటే…

బోటును రెండు ముక్కలు చేశాక వాటిని వెలికితీసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఆపరేషన్ అండర్ వాటర్.. బోట్లను ముక్కలు చేసే పనులు ప్రారంభం.. ఎలా కట్ చేస్తారంటే…

Updated On : September 11, 2024 / 7:47 PM IST

Operation Boat : ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీలైన్ ఆఫ్ షో డైవింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బోట్లను బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను తీసే విధంగా ప్లాన్ చేశారు. ఇవాళ కొంత మేరకు బోట్లను నీటి నుంచి బయటకు తీయగలిగారు.

బెలూన్లతో బోట్లను లిఫ్ట్ చేసే ప్రయత్నాలు కొంత మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్నటి వరకు నీళ్ల లోపల ఉన్న బోటు ఇవాళ కొంతవరకు కనిపిస్తోంది. దీంతో బోటును ముక్కలు చేసే పనులు ప్రారంభించారు. గ్యాస్ కట్టర్ సాయంతో బోటును రెండు ముక్కలు చేసే ప్రక్రియను స్పెషల్ టీమ్ ప్రారంభించింది. బోటును రెండు ముక్కలు చేశాక వాటిని వెలికితీసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

 

 

 

 

Also Read : ఆపరేషన్ కొల్లేరు..! సీఎం చంద్రబాబు అంత పెద్ద సాహసం చేయగలరా?