Prasad V Potluri : టీడీపీ వల్లే కేశినేని నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారు: పీవీపీ

కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పీవీపీపై కేశినేని నాని 8,726 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Prasad V Potluri : టీడీపీ వల్లే కేశినేని నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారు: పీవీపీ

Kesineni Nani - Prasad V Potluri

Updated On : January 6, 2024 / 10:53 AM IST

Kesineni Nani: విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే.

కేశినేని నాని బెజవాడకే గుదిబండలా తయారయ్యారంటూ పీవీపీ మండిపడ్డారు. టీడీపీ వల్ల కేశినేని నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారని విమర్శించారు. కేశినేనాని బ్యాంకులను బాది, ప్రజలను, ఉద్యోగులని పీల్చి పిప్పి చేశారని అన్నారు. ఇకనైనా కేశినేని నాని ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓ మూలన పడి ఉండాలని అన్నారు.

కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పీవీపీపై కేశినేని నాని 8,726 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తరువాత కుడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని భావిస్తున్నట్లు కేశినేని నాని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకుని, ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.

Kesineni Nani: ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను: కేశినేని నాని ప్రకటన