Kesineni Nani: ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను: కేశినేని నాని ప్రకటన
‘చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన‘ అని అన్నారు.

Kesineni Nani
టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించారు. త్వరలో లోక్‌సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి గతంలో దిగిన ఫొటోను కూడా కేశినేని నాని పోస్ట్ చేశారు.
‘అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి లోకసభ స్పీకర్‌ను కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకుని, ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’ అని కేశినేని నాని చెప్పారు.
తిరువూరు ఘటన కేశినేని నానిని రాజీనామా వరకూ తీసుకెళుతోంది. తిరువూరు సభ బాధ్యత కేశినేని చిన్నికి అప్పగించామని టీడీపీ ముఖ్య నేతల ద్వారా సమాచారం ఇచ్చింది ఆ పార్టీ అధిష్ఠానం.
అయితే, టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్ తనకు ఇవ్వడం లేదని ముగ్గురు నాయకులు తనకు చెప్పారని కేశినేని నాని అంటున్నారు. నిన్న తన అనుచరులతో సమావేశమయ్యారు. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఒక ఫ్లయిట్ కాకుంటే మరొక ఫ్లయిట్ ఎక్కాలి కదా? అని పార్టీ మార్పుపై సంకేతాలు ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024
రసవత్తరంగా చంద్రగిరి రాజకీయం.. చెవిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు సై అంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డి