MLA Prasanna Kumar Reddy : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబును ఏదో ఒక విధంగా జైల్లో నుంచి తీసుకొనివచ్చి వాళ్ల సామాజిక వర్గానికి చెందిన హాస్పిటల్లో చేర్చాలని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.

MLA Prasanna Kumar Reddy : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

MLA Prasanna Kumar Reddy

Updated On : October 16, 2023 / 2:15 PM IST

Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తిన్నాడని చెప్పి సీబీసీఐడీ కేసు పెడితే నీకెందుకొస్తున్నాయి అమ్మ కన్నీళ్లు అంటూ విమర్శించారు. చంద్రబాబుకి జైలు గదిలో అన్ని వసతులు కల్పించారు. భోజనం ఇంటి నుండే పంపిస్తున్నారు. రోజుకు మూడు సార్లు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. 24 గంటలు ఒక హెడ్ వార్డెన్, ఆరుగురు వార్డెన్లు, ఒక జైలు స్థాయి అధికారి విధులు నిర్వహిస్తున్నారు. అయినా చంద్రబాబుకు ఏదో అవుతుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు భద్రతకు ఎలాంటి డోకాలేదు. 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో చంద్రబాబు ఉంటున్నాడని, ఇప్పటికైనా బరువు తక్కువ డ్రామాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.

Read Also : CM Jagan : త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతున్నా.. ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తాం

ఏదో ఒక విధంగా జైల్లో నుంచి తీసుకొనివచ్చి వాళ్ల సామాజిక వర్గానికి చెందిన హాస్పిటల్లో చేర్చాలని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. 25 ఏళ్ల నుంచి  చంద్రబాబునాయుడుకు చర్మ సమస్య ఉంది. అత్తగారింట్లో అల్లుడ్ని ఎలా చూసుకుంటారో అలా చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూసుకుంటున్నారని అన్నారు. భువనేశ్వరమ్మను ఒకటే అడుగుతున్నా.. ఆరోజు నీ కన్న తండ్రి మీద చెప్పులు వేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు మీ ఆయన్ను జైల్లోవేశారని దొంగ కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : CM Jagan : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్

మీ నాన్న మీద చెప్పులు వేసినప్పుడు ఒక్క కన్నీటి బొట్టు కార్చావా? ఎందుకంటే ఆరోజుల్లో మీ ఆయన చంద్రబాబు సీఎం అవుతున్నాడు కదా.. అందువల్ల ఆ రోజు నీకు నీ కన్నతండ్రి కనబడలేదు. ఈరోజు మాత్రం ఇరగదీసుకొని రోడ్లపైకి వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు కోసం దొంగ ఏడుపులు ఏడుస్తుంది. కన్నీరుకూడా రావటం లేదంటూ భువనేశ్వరిపై ప్రసనకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఏడవాలా.. ప్రజలు చూడాలా.. ఈ నాటకాలు తప్పించి మరొకటి లేదంటూ ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.