Peddi Reddy: కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం.. మంత్రి పెద్దిరెడ్డి సవాల్

తమ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పుంగనూరుతోపాటు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తానని పెద్ది రెడ్డి చెప్పారు. అంతేకాదు.. తన నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి.

Peddi Reddy: కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం.. మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Updated On : January 16, 2023 / 9:08 PM IST

Peddi Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కుప్పం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు ఏపీ మంత్రి పెద్ది రెడ్డి. తమ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పుంగనూరుతోపాటు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తానని పెద్ది రెడ్డి చెప్పారు.

Pawan Kalyan: ‘వారాహి’కి పూజ.. కొండగట్టుకు జనసేనాని పవన్ కల్యాణ్

అంతేకాదు.. తన నియోజకవర్గమైన పుంగనూరులో చంద్రబాబు పోటీ చేస్తారా అని సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. తమ పక్షాన ప్రజలు ఉన్నంతవరకు తమ పార్టీ పని అయిపోదని, చంద్రబాబు తమపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పెద్ది రెడ్డి విమర్శించారు. జిల్లాలో తమపై పై చేయి సాధించడం చంద్రబాబు వల్ల కూడా కాదన్నారు.

Rishabh Pant: ప్రమాదం తర్వాత పంత్ తొలి ట్వీట్.. సర్జరీ గురించి ఏం చెప్పాడంటే

చంద్రబాబు తన మానసిక స్థితి ఏంటో వైద్యులను కలిసి చూపించుకోవాలని సూచించారు. చంద్రబాబు పరిస్థితి ఏంటో కుప్పంలోనే తేల్చుకుంటానని, ఆయన పుంగనూరులో చేసేది ఏమీ లేదని, కుప్పంలో టీడీపీ జెండాను శాశ్వతంగా పీకేసే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదని పెద్ది రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం చంద్రబాబు నాయడు పీలేరులో పర్యటించారు.

Siberian City: ఇదే అత్యంత చల్లటి నగరం.. చలి తట్టుకోవాలంటే క్యాబేజీలా డ్రెస్ చేసుకోవాలంటున్న స్థానికులు

అక్కడ సబ్ జైల్లో ఉన్న 8 మంది మైనారిటీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేశారు. పండుగ సమయంలో కూడా తన పార్టీ కార్యకర్తలను పెద్ది రెడ్డి జైల్లో పెట్టించాడని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు విమర్శలకు కౌంటర్‌‌గా పెద్ది రెడ్డి ఆయనపై విమర్శలు చేశారు.