చుక్కపడాల్సిందే : వర్షంలో గొడుగులు వేసుకుని మద్యం షాపుల వద్ద మందుబాబుల పాట్లు

  • Published By: nagamani ,Published On : July 24, 2020 / 01:58 PM IST
చుక్కపడాల్సిందే : వర్షంలో గొడుగులు వేసుకుని మద్యం షాపుల వద్ద మందుబాబుల పాట్లు

Updated On : October 31, 2020 / 4:38 PM IST

చల్లచల్లగా వర్షం పడుతుంటే..వేడి వేడిగా చక్కగా గొంతులో మద్యం దిగుతుంటే అబ్బా..స్వర్గంలో తేలిపోతున్నట్లుంటుంది మందుబాబులకు. చుక్క మందుకోసం ఎంతి రిస్క్ అయినా తీసుకుంటారు. కరోనా మహమ్మారిని కూడా లెక్కచేయనంత ధైర్యం వచ్చేస్తుంది. మాస్క్ లేకున్నా..భౌతిక దూరం గుర్తేఉండదు ఎదురుగా మద్యం షాపు కనిపిస్తుంటే..అదిగో అదే జరిగింది విశాఖపట్నంలో. మద్యం కోసం షాపుల దగ్గర వర్షంలో గొడుగులు వేసుకుని మరీ లైన్లలో నిలబడ్డారు. ఎంతో కర్రమశిక్షణగా.

లాక్ డౌన్ తో మద్యం పెద్దగా దొరకటంలేదు. దీంతో మందుచుక్క గొంతు దిగకపోతే శివాలెత్తిపోతున్నారు మందుబాబు. ఇంట్లో భార్యల్ని..పిల్లల్ని కొట్టటానికి కూడా వెనుకాడట్లేదు. బంధాలకంటే మందుబంధమేమాకు చాలంటున్నారు చుక్కరాయుళ్లు. భారీగా లైన్లలో నిలబడి ఒక్క మందుబాటిల్ సంపాదిస్తే మేమే మహారాజులం అన్నట్లుగా ఫోజులు కొడుతున్నారు.

విశాఖపట్నంలో లాక్ డౌన్ ను లెక్క చేయకుండా..వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మద్యం షాపుల వద్ద బారీ క్యూల్లో నిలబడి ఆశగా తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు ఒక్కబాటిల్ అయినా లభించకపోతుందాని. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని లైన్లలో నిలబడ్డారు. విశాఖపట్నంలోని ఉన్న 77 మద్యం దుకాణాల్లో 31 షాపుల్లో మాత్రమే మద్యం అమ్ముతున్నారు. దీంతో మద్యం షాపు తెరిచారనే సమాచారం తెలిస్తే చాలు మందుబాబులు ఎంత దూరమైనా సరే ఎగబడి వెళ్లిపోతున్నారు.

మద్యం అమ్మే షాపుల సంఖ్య తగ్గిపోవటం..కరోనా కేసులు పెరిగితే మద్యం దుకాణాలు ఇంక తెరవరేమో..మద్యం దొరకదేమోననే ఆందోళనతో మందుబాబులు వర్షంలో కూడా గొడుగులు వేసుకుని మద్యం షాపుల ముందు లైన్లలో నిలబడ్డారు.