Rachamallu Siva Prasad Reddy: నా పేరుతో ఆ వీడియోలు పెడుతున్నారు: వైసీపీ ఎమ్మెల్యే

తన ముబైల్‌కు అమ్మాయిల వీడియో లింక్‌లు పంపుతున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన..

Rachamallu Siva Prasad Reddy: నా పేరుతో ఆ వీడియోలు పెడుతున్నారు: వైసీపీ ఎమ్మెల్యే

Rachamallu Siva Prasad Reddy

Updated On : January 8, 2024 / 3:37 PM IST

రాజకీయంగా, భౌతికంగా తనను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆస్ట్రేలియా సంస్థతో కొందరు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని చెప్పారు.

తన ఫోన్ హ్యాక్ చేయాలని ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తితో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. తన పేరుతో అమ్మాయిల వీడియోలు పోస్ట్ చేస్తున్నారని అన్నారు. కొంత డబ్బులు కూడా చెల్లించారని చెప్పారు. వైసీపీని ఓడించడానికి టీడీపీ కుట్రలు పన్నుతోందని అన్నారు. ప్రొద్దుటూరులో తనను ఓడించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తన వ్యక్తిగత జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆ వ్యక్తి గురించిన సమాచారం పోలీసులకు ఇచ్చానని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగానూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటువంటి కుట్రలే జరుగుతున్నాయని అనుమానంగా ఉందని తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తన ముబైల్‌కు అమ్మాయిల వీడియో లింక్‌లు పంపుతున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన రాజకీయ ప్రత్యర్థులు ఇలా చేయిస్తున్నారని అనుమానం ఉందని తెలిపారు.

Telangana BJP : పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్.. నియోజకవర్గాలకు ఇంచార్జులు వీరే