Chaitanya Mahila Sangham Former Member Radhika : చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక కీలక ప్రకటన..మావోయిస్టు పార్టీలో చేరుతున్నట్టు లేఖ విడుదల
చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె లేఖ విడుదల చేసింది. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. స్వచ్ఛందంగానే మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నానని లేఖలో పేర్కొంది.

Chaitanya Mahila Sangham former member Radhika
Chaitanya Mahila Sangham Former Member Radhika : చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె లేఖ విడుదల చేసింది. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. స్వచ్ఛందంగానే మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నానని లేఖలో పేర్కొంది.
తన మిస్సింగ్ కేసును తన తల్లిని బెదిరించి పెట్టించారని తెలిపింది. తనను తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు రాధిక కృతజ్ఞతలు తెలిపింది. మహిళలపై వివక్ష, అరాచకాలపై పోరాడుతానని రాధిక స్పష్టం చేసింది.
Maoists Entered In Telangana : మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి రంగంలోకి దిగిన NSG బలగాలు
ఇటీవల వైజగ్‌లో నమోదైన రాధిక కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయడంతో అధికారులు చైతన్య మహిళ సంఘం నేతలపై వరుస దాడులు చేశారు. ఏపీ, తెలంగాణలోని పలువురి ఇళ్లల్లో ఎన్‌ఐఏ దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఈ దాడులను ఆమె ఖండించింది.