Raghu Rama Krishnam Raju : అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణంరాజు కుమారుడు

ఏపీలో అరెస్టుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్, ఆయన కూతురు ఇందు ప్రియదర్శిని. రఘురామపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.

Raghu Rama Krishnam Raju : అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణంరాజు కుమారుడు

Amthshah

Updated On : May 20, 2021 / 9:22 AM IST

Andhra Pradesh: ఏపీలో అరెస్టుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్, ఆయన కూతురు ఇందు ప్రియదర్శిని. రఘురామపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు వివరించి.. చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు.

మరోవైపు.. ఎంపీ రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. రఘురామకృష్ణంరాజు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని కౌంటర్‌ అఫిడవిట్‌లో కోరింది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకే రఘురామ కుట్రపన్నారని.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించింది వైసీపీ సర్కార్‌. వాక్‌ స్వాతంత్ర్యం హక్కు పేరుతో ఎవరైనా హద్దులు మీరొద్దని.. ప్రజల మధ్య చీలికతెచ్చే ప్రయత్నాలు సరికావని కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. రఘురామ ప్రకటన క్షుణ్ణంగా ప్రకటించిన తర్వాతే.. ఆయనపై రాజద్రోహం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

Read More : China Zhurong Rover Mars : అంగారక గ్రహంపై జురాంగ్ రోవర్ మొదటి ఫొటోలు విడుదల చేసిన చైనా