Posani Krishna Murali : అంతా డ్రామా- పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సీఐ కీలక వ్యాఖ్యలు

అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ కు తరలించి పోసానికి పరీక్షలు చేయించారు డాక్టర్లు.

Posani Krishna Murali : అంతా డ్రామా- పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సీఐ కీలక వ్యాఖ్యలు

Updated On : March 1, 2025 / 8:24 PM IST

Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యం అంతా డ్రామా అని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయనకు కడప రిమ్స్ లో అన్ని వైద్య పరీక్షలు చేయించామని సీఐ చెప్పారు. రిమ్స్ లో పోసానికి అన్ని వైద్య పరీక్షలు చేయించామని సీఐ వెల్లడించారు.

పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు కూడా ధృవీకరించారని చెప్పారు. మరోవైపు రిమ్స్ నుంచి బయటకు వెళ్లే సమయంలో తనకు కడుపు నొప్పిగా ఉందని పోలీసులతో చెప్పారు పోసాని. దీంతో ఆయనను అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ కు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు.

Also Read : రూ.100 కోట్లతో తాపీ మేస్త్రీ పరార్.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. వారం గడుస్తున్నా దొరకని ఆచూకీ

”కడుపులో నొప్పిగా ఉందని పోసాని చెప్పడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాం. అక్కడి నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి అన్ని వైద్య పరీక్షలు చేయించాం. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్య పరీక్షల్లో తేలింది. పోసాని నాటకం ఆడారని తెలిసింది. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నారు. ఈసీజీ, రక్త పరీక్షలు, కడుపు.. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాం. ఎలాంటి ఇబ్బందులు లేవు. పోసాని నాటకం ఆడి ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు పోసానిని తరలిస్తాం” అని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

పోసాని ఆరోగ్యంపై రిమ్స్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్వరి కీలక వివరాలు తెలిపారు. పోసాని ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామన్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉండటంతో రిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశామని రిమ్స్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్వరి వెల్లడించారు.