అమ్మఒడి కావాలంటే రూ.వెయ్యి ఇవ్వాల్సిందే, ఒక్కో విద్యాకానుక కిట్ ధర రూ.వెయ్యి.. ప్రభుత్వ టీచర్ల కలెక్షన్ల పర్వం

money for jagananna vidya kanuka: శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్లు దారి తప్పారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. కలెక్షన్ల పర్వానికి తెరతీశారు. జగనన్న విద్యాకానుక కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు ఉపాధ్యాయులు.
జగనన్న విద్యాకానుక కిట్ తీసుకోకపోతే అమ్మఒడి పథకం రాదని అపోహలు కల్పిస్తున్నారు. టీచర్లు అడిగిన వెయ్యి రూపాయలు కట్టలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు అమ్మఒడి పథకం కోసం కూడా విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేశారు టీచర్లు.