Ram Gopal Varma: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఇలా సాగింది..! చం(ద)మామ కథ అంటూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ ..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ లను టార్గెట్ చేసుకొని ట్వీట్లు చేసే రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు. గత రెండు రోజుల క్రితం ట్విటర్ వేదికగా చంద్రబాబు సపోర్టర్స్‌కు ..

Ram Gopal Varma: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఇలా సాగింది..! చం(ద)మామ కథ అంటూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ ..

Ramgopal varma

Updated On : September 17, 2023 / 8:21 AM IST

Chandrababu arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా పలువురి తెలుగువారి నుంచి మద్దతు లభిస్తుంది. పలు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు స్కిల్ స్కాం ఇలా సాగిందంటూ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

CM Jagan Comments on Chandrababu : స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం‎లో సూత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ లను టార్గెట్ చేసుకొని ట్వీట్లు చేసే రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు. గత రెండు రోజుల క్రితం ట్విటర్ వేదికగా చంద్రబాబు సపోర్టర్స్‌కు 12 ప్రశ్నలను సంధించిన ఆయన.. తాజగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఇలా జరిగిందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీ‌ట్ ప్రారంభంలో ‘చం(ద)మామ కథ.. CBN స్కిల్ స్కాంని, చందమామ కథలా పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే’.. అంటూ స్కాం ఎలా జరిగిందో వర్మ వివరించడం ప్రారంభించాడు. ఈ ట్వీట్‌ చివర్లో ‘చట్టం ముందు అందరూ సమానమేనని జ్యూడిషరీ నిరూపించింది. ఈ కథ సమాప్తం కాదు.. మిగితా కథ వచ్చే వారాల్లో’ అంటూ రాంగోల్ వర్మ ట్వీట్ చేశారు. మరోవైపు.. రాంగోల్ వర్మ ట్వీట్ పై చంద్రబాబు మద్దతుదారులు మండిపడుతున్నారు.